http://srigurusangamam.webs.com/


SRIPADA SRI GURU SANGAMAM

దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..

      Sripada Sri Guru Sangamam (శ్రీపాద శ్రీ గురు సంగమం)

శ్రీపాద శ్రీ వల్లభ స్తోత్రం
II  కృష్ణాసుతీరేవసతి ప్రసిద్ధం I   శ్రీపాద శ్రీ వల్లభ యోగముర్తిం
సర్వైజ నైశ్చించిత కల్పవృక్షం I   శ్రీపాద రాజం శరణం ప్రపద్యే  II

 
 
 శ్రీపాద రాజం శరణం ప్రపద్యే ... శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణాశ్రితులారా...శ్రీగురు బంధువు లారా..
మన రాష్ట్రం లోనేకాదు దేశ వ్యాప్తంగా కుడా శ్రీపాదుల వారి ఆలయాలు చాలా అరుదు. మన దేశంలో శ్రీపాద శ్రీ వల్లభులు ప్రదానంగా కొలువుదీరిన ఆలయాలను లెక్కించడానికి చేతి వేళ్ళు కుడా ఎక్కువే.
దిక్కులే అంబరములు గా కలిగిన, దత్తాత్రేయుని నవాంశ మైన శ్రీపాద శ్రీ వల్లభులు ప్రదానంగా కొలువుదిరే  ఆలయాన్ని నిర్మించాలనే నా సంకల్పానికి శ్రీపాద శ్రీ వల్లభులు పచ్చజెండా ఊపి ఆశీర్వదించారు. కాని ఆ ఆలయం ఎక్కడ, ఎలా, ఏవిధంగా నిర్మించాలో నాకు అర్ధం కాని పరిస్థితి. మళ్లీ శ్రీపాదులవారే రంగం లోకి దిగి ఆలయంఆంధ్రప్రదేశము లోని త్రివేణి సంగమం లో నిర్మించమని రకరకాలైన పరిస్థితులను నాకు కల్పించి తెలియజేసారు. దేవాలయ నిర్మాణానికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎకరాల భూమిని కొనవలసినది గా వారి ఆజ్ఞ . భూమిని కొనడానికి 'భూదాన కార్యక్రమం' క్రింద మొత్తం భూమి ధరను గజమున కు లెక్కించి, ద్రవ్య శుద్దిగల భక్తులనుండి సేకరించమని తెలిపిరి. ఆ తరువాత కాగల కార్యమును తానే దగ్గరుండి నడుపుతానని వారు శెలవిచ్చిరి. ఈ మొత్తం నిర్మాణాన్నిశ్రీపాద శ్రీ వల్లభులు "శ్రీపాద శ్రీ గురు సంగమం" గా పేర్కొన్నారు. దేవాలయ కాంప్లెక్సు నందు శ్రీపాద శ్రీ వల్లభుల ప్రదాన ఆలయం తో పాటుగా అనేక దత్త వృక్షాలు, శ్రీ గురుదత్త విరాట్ విశ్వరూప ఆలయం, షణ్ముఖ, మహా గణపతి మరియు ధర్మశాస్త అయ్యప్ప లు కలసిఉన్న గుడి, అనఘ దత్తాత్రేయుల ఆలయం, కాలాగ్నిశమన  దత్తాత్రేయుడు, హనుమత్సహిత షిర్డీ సాయినాధుడు అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయములు ఉండాలన్నది శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆదేశము.  అప్పటికి నాకు అలహాబాదు లోని త్రివేణి సంగమమైతే తెలుసు గాని ఆంద్రప్రదేశ్ లో కూడా ఒక త్రివేణి సంగమం కలదని నాకు తెలియదు. ఆ తరువాత విచారణ లో ఆంధ్రప్రదేశ్ లోని త్రివేణి సంగమం కరీంనగర్‌ జిల్లాలో ఓ మారుమూల అటవీ ప్రాంతము లో  పవిత్ర గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి(conceal - అంతర్వాహిని) నదుల సంగమం కలదని, అటువంటి త్రివేణి సంగమమైన ఆ ప్రాంతం పేరు కాళేశ్వరం అని తెలిసినది . ఇచ్చట  గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు మహారాష్ట్ర లోని సిరోంచ (సిరివంచ) ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది. ఈ కాళేశ్వరం దక్షిణ భారతదేశ త్రివేణీ సంగమంగా అలాగే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది. కాళేశ్వరం లోని గోదావరి నదికి ప్రతీకగా"శ్రీపాద" అని (శ్రీపాద శ్రీ వల్లభుల వారిది గోదావరి పరివాహక ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా లోని పిఠాపురం)  ప్రాణహిత నదికి ప్రతీకగా "శ్రీ గురు" అని (మహారాష్ట్ర లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని 'శ్రీ గురు' అని సంభోదిస్తారు), ఈ రెంటి కలయిక వలన వారు ఈ నిర్మాణానికి "శ్రీపాద శ్రీ గురు సంగమం" అని పిలిచారు. అంతర్వాహిని గా ఉన్న సరస్వతి నదికి ప్రతీకగా ఎవరున్నది ఇంకా స్వామీ తెలపవలసి ఉన్నది.
శ్రీపాదుల వారి లీలలు అనూహ్యంగా, ఆశ్చర్యంగాను  ఉంటాయి. వారి  కరుణ ఎవరిమీద ఎందుకు, ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవరూ ఊహించలేరు.  నాపై శ్రీపాదుల వారు కురిపించిన ఈ అనుగ్రహం నా పూర్వజన్మ సుకృతం అనేకంటే సామాన్య మానవులను కుడా వారు ఎలా కరుణిస్తారో తెలియజెప్పడానికి ఒక ఉత్తమ ఉదాహరణ. శ్రీపాదశ్రీ వల్లభుల ఆజ్ఞానుసారం "శ్రీపాద శ్రీ గురు సంగమం" ను నిర్మించడానికి  శ్రీపాదుల దివ్య శ్రీ చరణాశ్రితులైన మీరు మాకు ఏవిధంగా  సహాయపడగలరో, శ్రీపాద శ్రీ గురు సంగమ నిర్మాణములో ఏ విధంగా పాలు పంచుకోగలరో మా ఈ  క్రింది మెయిల్ ఐడి కి మెయిల్ ద్వారా తెలపండి. 
శ్రీపాద శ్రీ వల్లభ దర్శన ప్రాప్తిరస్తు...
మీ
keerthivallabha (కీర్తివల్లభ)
keerthivallabha@gmail.com (కీర్తివల్లభ@జిమెయిల్.కాం)  
 
Email : srigurusangamam@hotmail.com
 
 
 
   కాళేశ్వరం శాటిలైట్ పిక్చర్స్ (గూగుల్ ఎర్త్ వారికి దన్యవాదములతో)
 శ్రీపాద శ్రీ గురు సంగమ నిర్మాణానికి కాళేశ్వరాన్ని శ్రీపాదుల వారు ఎన్నుకోవడానికి గల కారణాలు:
  • త్రివేణి సంగమమై ఉండడం. 
  • శ్రీశైలమంత గొప్ప శక్తి గల క్షేత్ర మవ్వడం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉండడం.
  • దత్త భక్తులు ఎక్కువగా కల మహారాష్ట్ర సరిహద్దు లో ఉండడం.
  • కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం లో మహిమాన్విత ఔదుంబర వృక్షం (మేడిచెట్టు) ఉండడం.
  • ఒకే పానపట్టంపై రెండు లింగాలు ఉండడం . ఒకటి కాళేశ్వరుడు లేదా కాలుడు (యముడు) రెండవది ముక్తీశ్వరుడు (ఈశ్వరుడికి ప్రతిభింభం).
  • బ్రహ్మ,విష్ణు,ముక్తీశ్వర ఆలయాలు ఉండడం.
  • కాళేశ్వరం దక్షిణ భారతదేశ త్రివేణీ సంగమంగా అలాగే దక్షిణ కాశీగా అలాగే దక్షిణ ప్రయాగ గా ప్రసిద్ధి చెందడం.
  • ముక్తీశ్వర లింగానికి వున్న నాసిక రంద్రాలగుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదిరూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో  కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడడం.
  • కాళేశ్వరంలో మహా సరస్వతి ఆలయం ఉండడం.
  • అంతేకాకుండా దేశంలోని మూడు సూర్యదేవాలయాల్లో ఒకటి కాళేశ్వరంలో ఉండడం .
  • ఆలయ గర్బగుడిలో నాలుగు ద్వారాలు ఉండడం.
  • కాళేశ్వరంలోబ్రహ్మతీర్దం, పక్షితీర్దం, సంగమతీర్దం,చిచ్యుత తీర్దం, జ్ఞానతీర్దం, నృసింహతీర్దం, హన్మత తీర్దం, వ్యాసతీర్దం అనే అష్టతీర్దాలు ఉండడం.
  • కాళేశ్వరంలో ప్రకృతి సిద్దమైన విభూతి దొరకడం (కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి కిలోమీటర్‌ దూరంలో శ్రీ ఆది ముక్తీశ్వరస్వామి ఆలయం చుట్టుప్రక్కన ఎక్కడ తవ్వినా విభూతి రాళ్ళు లభ్యమవుతాయి. ఈ రాయిని పగలగొడితే అందులో ప్రకృతి సిద్దమైన సహజ విభూతి లభిస్తుంది).
  • సరస్వతీ నది  గుప్త కామినిగా ప్రవహించడం (ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవాలయంలో శివ లింగం పై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కుద్వారా సేకరించి గోదావరి-ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది, శివుని ముక్కు నుండి గోదావరి-ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వార అంతర్వాహిని గా వెళ్ళే శివున్ని అర్చించిన జలమే సరస్వతి నది, అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి,  సరస్వతీ నదికి గుప్త కామినీ అను ఇంకో పేరు కూడా ఉంది. గుప్తంగా వచ్చి కలయుట, సరస్వతీ నది లుప్తమై, గుప్తనది గా ప్రవహించడం తో గుప్త కామినీ అనే పేరు వచ్చిందంటారు. 
  • పిఠాపురం , కాశీ ల వలె   కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం (కాశీ కి వెళ్ల  లేని వాళ్ళు ఇక్కడ గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు, ఇది కాశీ లో జరిపించినంత  పుణ్యమని చెప్తారు).
  • త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వరం ఒకటి అవ్వడం.
 
 
 
 














 


 

 


 

 
 

 
 


















 

 
 

 
































 
 jlkfdjlkjlkgjldkj;lsfj;lj;lkjdf;lj;lkj;lkjg;lkjlkgj;lhj;ljh;lgj;lg;hljg;lhj;dlg

 

 




 
 


































































































.














కాళేశ్వరం స్థల పురాణం :
  
కరీంనగర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో పవిత్ర గోదావరి, ప్రాణహిత, సరస్వతి(అంతర్వాహిని) నదుల సంగమం అందు వెలసిన కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం త్రివేణి సంగమ క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఒకే పానపట్టంపై రెండు లింగాలు (కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు) ఉండడం ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత అంతేకాకుండా ముక్తీశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రం ద్వారా అభిషేక జలం బయటి రాకుండా భూమార్గం గుండా ప్రవహించి సరస్వతి నది రూపంలో ప్రాణహిత, గోదావరి నదుల్లో కలిసి త్రివేణి సంగమంగా మారుతుందనే విశ్వాసం ఉంది. త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వరం ఒకటి. అలాగే దేశంలోని మూడు సరస్వతిదేవి ఆలయాల్లో ఒకటి ఇక్కడ ఉండడం విశేషం (బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయం, కాశ్మీర్‌లో ప్రౌఢ సరస్వతి ఆలయం, కాళేశ్వరంలో మహా సరస్వతి ఆలయాలు ఉన్నాయి). అంతేకాకుండా దేశంలోని మూడు సూర్య దేవాలయాల్లో ఒకటి కాళేశ్వరంలో ఉండడం గమనార్హం. ఆలయ గర్బగుడిలో నాలుగు ద్వారాలు ఉండడం చాలా అరుదైన విషయం. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి ఈ విశేషం ఉంది. ఇక్కడ బ్రహ్మతీర్దం, పక్షితీర్దం, సంగమతీర్దం,చిచ్యుత తీర్దం, జ్ఞానతీర్దం, నృసింహతీర్దం, హన్మత తీర్దం, వ్యాసతీర్దం అనే అష్టతీర్దాలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కాళేశ్వరంలో ముక్తీశ్వర స్వామి ఆలయం ఒకటే ఉండేదని, స్వామి దర్శించిన వారందరూ స్వర్గలోకం వెళ్ళే వారని స్కంద పురాణంలో పేర్కొనబడింది. దీనితో నరలోకం నామమాత్రంగా మిగిలిపోవడంతో కాలుడు(యముడు) ఈశ్వరున్ని వేడుకున్నాడు. తన వద్దకు జనులు రావడం లేదని తననెవరూ కొలవడం లేదని, యమధర్మరాజు శివుని తో మొరపెట్టుకోవడంతో ఆయన సలహా మేరకు కాళేశ్వర స్వామి పేరిట ముక్తీశ్వరుని సరసన వెలిశాడని చెబుతారు. మొదటగా కాళేశ్వరునికి నమస్కరించి (యముడు) అనంతరం ముక్తీశ్వరునికి పూజలు చేస్తే మోక్షం, స్వర్గప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒకే ప్రాకారంలో అనేక ఆలయాలు ఉండడం మరో విశేషం. దీనితో త్రివేణి సంగమ కాళేశ్వరం భక్తులను విశేషంగా ఆకర్శిస్తుంది. ప్రకృతి సిద్దమైన విభూతి దొరకడం ఈ కాళేశ్వరం యొక్క మరో ప్రత్యేకత. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి కిలోమీటర్‌ దూరంలో శ్రీ ఆది ముక్తీశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కన ఎక్కడ తవ్వినా  విభూతి రాళ్ళు లభ్యమవుతాయి. ఈ రాయిని పగలగొడితే అందులో విభూతి లభిస్తుంది. శివుడు తన నుదుట విభూతి రాయి వేసుకుని చేతులు విదిల్చినప్పుడు బస్మరేణువులు ఈ ప్రాంతమంతా పడటంతో ఇక్కడి రాళ్ళలో ప్రకృతి సిద్దంగా విభూతి ఏర్పడిందని పూర్వీకులు చెబుతారు
సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్‌ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు మహారాష్ట్ర ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది. అతిప్రాచీనచరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేకప్రత్యేకతలున్నాయి. భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాశికారంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీసంగమతీరంలో కలిసిందీ, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణిసంగమతీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కంటే గొప్పదని 'కాళేశ్వరఖండవలు' ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.ఇక్కడ గల 'యమకోణం' భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
 

ప్రణీతా నది (లేదా) ప్రాణహిత నది

ప్రణీతా నదే 'ప్రాణహిత' నదిగా పిలువబడుతుంది. ఈ నది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో జన్మించి, వార్ధ, పెన్‌గంగ చిన్న నదులను కలుపుకొని ఏర్పడినది. ఈ ప్రాణహిత నదీ తీరంలో కాళేశ్వర క్షేత్రం ఉన్నది.  ఈ క్షేత్రం ప్రణీతా, గోదావరి, అంతర్యాహినిగా సరస్వతి అను మూడు నదుల సంగమం. అందువల్లే కాళేశ్వరాన్ని దక్షిణ త్రివేణి సంగమం అని, దక్షిణ ప్రయాగ అని కూడా అంటారు. .ప్రణీత నది వ్యవహార నామమే ప్రాణహిత.  ప్రాణహిత గోదావరికి ఉపనది. పుష్కర పుణ్య స్నానాలకు శ్రేష్ట మైన పన్నెండు నదులలో ప్రాణహిత ఒకటి. గోదావరి ఉపనదులలో ప్రాణహిత నది పెద్దది. .ప్రాణహిత నది జన్మస్థానం  తుమిడిహెట్టి (ఆదిలాబాదు జిల్లా). తుమిడిహెట్టి వద్ద వార్థా, పెన్‌గంగ నదుల కలయికతో ప్రాణహిత నది జన్మిస్తుంది.  పెన్‌గంగ నది తీరాన మహారాష్ట్రలో మహోర్‌ దత్తపీఠం ప్రముఖ దత్తక్షేత్రం గా  విరాజిల్లుతోంది. గోదావరి నదైనా వేసవిలో ఎండుతుందేమో  కాని ప్రాణహిత అన్ని కాలాలలో నిండుగా, వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. 

గోదావరి నది

గోదావరి నది జన్మస్థానము త్రయంబకేశ్వర్(మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలో). గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరి నది అదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి(గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు,మిగిలినవి అంతర్వాహినిలు(conceal). గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో వ్యాపించి ఉన్నది. గోదావరి నది యొక్క ప్రధాన ఉపనదులు: వైన్‌గంగా, పెన్ గంగ, వార్ధా నది, మంజీరా నది, ఇంద్రావతి నది, బిందుసార, శబరి, ప్రవర, ఫూర్ణా, ప్రాణహిత, సీలేరు నది, కిన్నెరసాని, మానేరు. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పట్టణాలు ఉన్నాయి.

గుప్త కామినీ (లేదా) సరస్వతి నది

సరస్వతీ నదే 'గుప్త కామినీ'. ముక్తీశ్వరలింగ అభిషేక జలమే సరస్వతి నది. కాళేశ్వర క్షేత్రం లో ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉంటాయి. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలుంటాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. ముక్తీశ్వర లింగం ముక్కు ద్వారా అభిషేక జలం సరస్వతి నదిగా మారి గోదావరి- ప్రాణహిత ల సంగమం తో కలసి  త్రివేణిసంగమం గా ఏర్పడట్టు చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాశికారంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీసంగమతీరంలో కలిసిందీ, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణిసంగమతీరాన చూడగా పాలు కనబడినట్లు గా చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. సరస్వతీ నది  గుప్త కామినిగా ప్రవహించడం వల్ల సరస్వతీ నదికి 'గుప్త కామినీ' అను ఇంకో పేరు కూడా ఉంది. గుప్తంగా వచ్చి కలయుట, సరస్వతీ నది లుప్తమై, గుప్తనది గా ప్రవహించడం తో గుప్త కామినీ అనే పేరు వచ్చిందంటారు. అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి.

Sripsds Sri Vallabha - 1 (శ్రీపాద శ్రీ వల్లభ - 1)

Sripsds Sri Vallabha - 2 (శ్రీపాద శ్రీ వల్లభ - 2)

Sripsds Sri Vallabha - 3 (శ్రీపాద శ్రీ వల్లభ - 3)